AKP: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్ రాయవరం ఏవో సౌజన్య తెలిపారు. వరి పంట సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 4,604 మంది రైతులు 2,688 హెక్టార్లలో వరి పంటకు బీమా చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే బీమా పరిహారం పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంటల బీమా చేయించుకోవాలి'


