హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆడిట్‌లో 21 పిటిషన్లకు సత్వర పరిష్కారం

అన్నమయ్య: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్‌ టీం ద్వారా జిల్లాకు పంపిన 21 పిటిషన్లపై జేసీ శర్మ సోమవారం విచారణ నిర్వహించారు. అర్జీదారులు, సంబంధిత అధికారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిశీలించారు. అధికారుల స్థాయిలో లోపాలు గుర్తించిన చోట్ల తక్షణమే సరిదిద్ది అర్జీదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం తీసుకున్న నిర్ణయాలపై అర్జీదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు.