PDPL: ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 170 మంది విద్యార్థులకు స్థానిక వ్యాపారవేత్త జైన రాజమౌళి- అరుణ దంపతులు సోమవారం మధ్యాహ్న భోజనం చేయడానికి స్టీల్ ప్లేట్లు బహుకరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మల్లారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్, కాంప్లెక్స్ హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
170 మంది విద్యార్థులకు ప్లేట్స్ బహుకరణ


