MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ముమ్మడి మహేష్ (25) సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం రాత్రి బోనాల వేడుకలకు వెళ్లిన మహేష్ ఫోన్ పోగొట్టుకున్నాడు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ పోయిన విషయం తల్లి మందలిస్తుందనే భయంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఫోన్ పోయిందని యువకుడి ఆత్మహత్య


