హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి వివాదంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి: మాజీ MLA

HNK: వైఎస్ఆర్ నగర్‌లో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. 2005 నుంచి అక్కడే నివసిస్తున్న పేదలకు ఇంటి నంబర్లు, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపారు. భూమి వివాదంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.