SS: పుట్టపర్తిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30 వేల జరిమానా విధించింది. ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పుట్టపర్తి టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ యువరాజు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి జరిమానా


