హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.7.55 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం

SRCL: వేములవాడలో సీఎంఆర్ డిఫాల్ట్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వానికి రూ.7.55 కోట్ల నష్టం కలిగించినట్లు గుర్తించారు. కస్టమ్ మిల్లింగ్‌కు అప్పగించిన 8,447 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను నిందితులు నిర్దేశిత సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అందించలేదని ఎస్‌డీపీఓ ఏ.శ్రీనివాసులు తెలిపారు. కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.