హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘జలధార - జలహారతి 2.0’తో భూగర్భ జలాల పెంపు: కలెక్టర్

SS: భూగర్భ జలమట్టాలను పెంచడమే లక్ష్యంగా ‘జలధార - జలహారతి 2.0’ నిరంతర ప్రక్రియగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, డ్వామా అధికారులతో ప్రగతిపై సమీక్షించారు. ఎల్ నివో ప్రభావం ఉన్నందున చెరువులు, కాలువలకు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు.