కృష్ణా: గుడివాడలో నలంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్సై నాగరాజు రోడ్డు భద్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


