జగిత్యాల స్వామి వివేకానంద స్టేడియంలో జిల్లాస్థాయి ఆత్యపత్య పోటీల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. కోరుట్ల జట్టు తరఫున ఆడిన జయాన్, రక్షిత్, రిషిక్, నీరజ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. సోమవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ గుజ్జేటి వెంకటేష్, ఉపాధ్యాయులు ఈ విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
ఆత్యపత్య పోటీల్లో కోరుట్ల విద్యార్థుల సత్తా


