హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభయ అవగాహన కార్యక్రమం

AKP: నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బందికి మహిళలు, బాలికల భద్రతపై అవగాహన సోమవారం కల్పించారు. ఎస్సై జి.ఉమామహేశ్వరరావు చట్టపరమైన రక్షణ, సైబర్‌ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలపై వివరించారు. అత్యవసర సమయంలో 112, మహిళా హెల్ప్‌లైన్‌ 181, సైబర్‌ క్రైమ్‌ 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.