హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇర్రెగ్యులర్ విద్యార్థులపై అధికారుల ఫోకస్

GDWL: గట్టు మండలం బలిగెరలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 10వ తరగతి ఇర్రెగ్యులర్ విద్యార్థుల ఇళ్లను సోమవారం అధికారులు సందర్శించారు. ఇన్‌చార్జ్ మాస్టర్ రఘు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పోలీసుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా బడికి పంపాలని సూచించారు.