హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

అన్నమయ్య: మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ, సీఐల బృందం కార్యాలయాన్ని తనిఖీ చేసింది. సుమారు 10 మొబైల్ ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అధికారుల ప్రకటనతో వెల్లడి కావాల్సి ఉంది.