నిర్మల్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ రూ. 50 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి ACBని ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ ప్రకారంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు. రసాయన పరీక్షలు చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయని ACB అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: ACB వలలో GST అధికారులు


