హైదరాబాద్: 28°C
తెలంగాణ

7వ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ బదిలీ

 NZB: తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ పి. సత్యనారాయణ ఇంటెలిజెన్స్, తెలంగాణకు బదిలీ అయ్యారు. అడిషనల్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టి, మే 31న కమాండెంట్‌గా పదోన్నతి పొందిన ఆయన ఆగస్టు 24 వరకు బెటాలియన్‌కు సేవలందించారు. ప్రస్తుతం 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ 7వ బెటాలియన్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.