SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని SP మహేశ్వర రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీపై చట్టపరంగా విచారణ జరిపి, త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 ఫిర్యాదులు


