హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ

PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా సీతానగరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎస్‌.వి. మాధవ్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసు దస్త్రాలు, పరిసరాలను పరిశీలించి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.