హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో రూ.1.14 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, డబ్ల్యూబీఎం రోడ్లను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.