హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సాయంత్రం ఆకలికి హెల్తీ స్నాక్ ఇవే!

సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్‌, జంక్‌ ఫుడ్‌కు బదులుగా వేరుశెనగల మిశ్రమాన్ని ట్రై చేయవచ్చు. వేయించిన వేరుశెనగల్లో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బాదం, నిమ్మరసం, ఉప్పు, కారం, జీలకర్ర పొడి కలిపితే రుచికరమైన స్నాక్‌ సిద్ధమవుతుంది. ఇందులో ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అలెర్జీ ఉన్నవారు దూరంగా ఉంటే మంచిది.