హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్ల నుంచి తరచూ నీరు కారుతోందా?

కళ్ల నుంచి తరచుగా నీళ్లు కారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కళ్లలో తగినంత తేమ లేకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ ఏర్పడవచ్చు. దీంతో కళ్లలో మంట, దురద, చికాకు, ఇసుక ఉన్నట్లుగా అనిపించవచ్చు. దీనికి ప్రతిస్పందనగా కళ్లలో అధికంగా కన్నీళ్లు ఉత్పత్తి కావచ్చు. ఒకటి లేదా రెండుసార్లు కళ్ల నుంచి నీరు కారడం సాధారణమే కావచ్చు. ఈ సమస్య తరచూ వస్తుంటే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.