హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉత్తానాసనం వల్ల కలిగే ఉపయోగాలు

ఉత్తానాసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల శరీరానికి, మనస్సుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తలను కిందికి ఉంచడం వల్ల మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ముందుకు వంగడం వల్ల ఉదర భాగానికి మంచి మర్దన అందుతుంది. జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడటానికి సహాయపడుతుంది.