VZM: గర్భాం-గరివిడి ప్రధానరహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అడుగుకో గొయ్యి ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.రహదారి మరమ్మతులకు రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిసినా పనులు ప్రారంభించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గర్భాం—గరివిడి రహదారి అధ్వానం


