హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సవరణపై నేడు సమీక్ష

VSP: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం నియమించిన రోల్ అబ్జర్వర్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు, EROలు హాజరుకానున్నారు. కొనసాగుతున్న SIR ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ అంశాలపై చర్చించనున్నారు.