KKD: తుని మండలంలోని లోవ శ్రీ తలుపులమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 14 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, ప్రసాదాల విక్రయం ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.7,31,866 ఆదాయం సమకూరినట్లు ఈఈ విశ్వనాథరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తలుపులమ్మ ఆలయానికి రూ.7.31 లక్షల ఆదాయం


