SKLM: టెక్కలి సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో శక్తి యాప్‌పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీం సభ్యులు నరసింహమూర్తి, ప్రభావతి విద్యార్థులకు మహిళల భద్రత, పోక్సో చట్టం, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1091, సైబర్ మోసాలకు 1930 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం


