హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సజ్జలను కలిసిన కనిగిరి ఇన్‌ఛార్జ్

ప్రకాశం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జలను శాలువాతో సన్మానించారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.