హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులకు వర్షం బ్రేక్.. చెరువులా మారిన రోడ్డు

NRPT: మద్దూర్ పట్టణంలోని పెద్రిపహాడ్ రోడ్డులో టౌన్ లిమిట్ పరిధిలో 1 కి.మీ మేర 4-లైన్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. వర్షంతో పనులు జరుగుతున్న ప్రాంతంలో భారీగా నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు, స్థానికులు, దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.