హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినూత్న రీతిలో నిరసన

అనకాపల్లి జిల్లాలో దళితవాడల్లో మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పాడెను మోస్తూ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ.. మంచినీరు డ్రైనేజ్ రహదారి సౌకర్యం లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.