హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు ఫుల్.. సాగునీటికి ఢోకా లేదు

SRD: కల్హేర్ మండలంలో భారీ వర్షాలతో బీబీపేట్ చెరువు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. మత్తడి దూకుతుండటంతో ఆయకట్టు రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండడంతో ఈ ఏడాది పంటలకు సాగునీటి ఇబ్బందులు ఉండవని హర్షం వ్యక్తం చేశారు.