హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి: రవి పటేల్

BHPL: జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. యూరియా, DAPతో పాటు పురుగుమందులను కూడా దుకాణదారులు ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, ధరల వివరాలతో రేట్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.