హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదిగల స్మశాన వాటిక సమస్యపై వినతి

కృష్ణా: గుడివాడలో మాదిగ వర్గాల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని, రైలుపేటలో ఉన్న స్మశాన స్థలం పూర్తిగా నిండిపోయిందని తెలిపారు. ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందించారు.