హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లారెడ్డికి సీపీఎం నేతల నివాళి

BDK: పినపాక మండలంలో సీపీఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం అఖిల భారత నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతికి పార్టీ నాయకులు సోమవారం నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్‌తో పాటు మండల కమిటీ సభ్యులు సంతాపం తెలిపారు. మల్లారెడ్డి సేవలను స్మరించుకున్నారు.