హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వీయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి'

SRPT: పోలీస్ సిబ్బంది స్వీయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమాజంలో సాధారణ పౌరులకు ఆదర్శంగా ఉండాలని, బెట్టింగ్ సంస్కృతికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అప్పులు చేయడం, భద్రత లేని వ్యాపారాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు.