హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: అంగన్వాడీ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి సూపర్‌వైజర్ పద్మావతి అన్నారు. రాయికల్ పట్టణంలోని 5వ వార్డులో గల రెండవ అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలలు నిండిన చిన్నారులకు సోమవారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమాదేవి, పద్మ పాల్గొన్నారు.