హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మున్సిపల్ భవనం కూల్చివేత

GNTR: తెనాలి మున్సిపల్ ఆఫీస్ పాత భవన కూల్చివేత పనులు ఆగస్టు 25న ఉదయం 11:15 గంటలకు ప్రారంభం అవుతాయని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. గుత్తేదారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు, స్థానికులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు.