హైదరాబాద్: 28°C
క్రీడలు

సైనా నెహ్వాల్‌ కీలక ప్రకటన!

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుంది. బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పింది. పార్టీ విధానాలు నచ్చి గతంలోనే బీజేపీలో చేరిన సైనా, క్రీడా రంగం తర్వాత రాజకీయ నాయకురాలిగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపింది.