హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

పల్నాడు జిల్లా రొంపిచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టు కోచింగ్‌ క్యాంప్‌ ప్రారంభమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 32 మంది క్రీడాకారులు శిబిరంలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌ 9 వరకు శిక్షణ కొనసాగనుంది. సెప్టెంబర్‌ 11, 12, 13 తేదీల్లో బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొననుంది.