NZB: సిరికొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే కార్యాలయంలోని మహిళల మరుగుదొడ్డికి తాళం వేసి ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో తెలియక మహిళలు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్డిని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
తెలంగాణ
'మహిళల మరుగుదొడ్డికి తాళం'


