హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NLG: దేవరకొండ రోడ్డులోని గంగవారి గూడెం వెళ్లే మార్గంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలకు తగలడంతో రాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.