హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకటన బోర్డులపై రగడ.. ధర్నా

SDPT: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటన బోర్డులకు వెంటనే బహిరంగ టెండర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్, బీఎస్పీ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. టెండర్ లేకుండా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించి, మున్సిపల్ ఆదాయానికి నష్టం జరగకుండా టెండర్ నిర్వహించాలని కోరారు.