హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 1 లోగా సాగునీరివ్వాలి: సండ్ర డిమాండ్.!

KMM: తల్లాడ రైతులకు సెప్టెంబర్ 1 లోగా సిరిపురం కాలువ ద్వారా నీరివ్వాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. అన్నారగూడెంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. హామీ నెరవేర్చకుంటే ఇరిగేషన్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమన్నారు.