హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన కళాశాలలో IHRC ఆకస్మిక తనిఖీ

RR: షాద్‌నగర్ గిరిజన సంక్షేమ నివాస డిగ్రీ,పీజీ కళాశాలలో IHRC ప్రతినిధులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల వసతి, తరగతి గదులు, పరిశుభ్రత, మెస్ ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమంపై నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. గుర్తించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వెల్లడించారు.