హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనదారులకు వీధికుక్కల ముప్పు

NLG: నల్గొండ-నకిరేకల్ జాతీయ రహదారిపై చందనపల్లి డంపింగ్ యార్డు వద్ద గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. బైకర్లు, పాలకు వెళ్లే రైతులపైకి హఠాత్తుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఈ కుక్కలను పట్టుకుని, సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.