హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి CMRF ఆర్థిక సాయం అందించిన స్పీకర్

VKB: హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వికారాబాద్ 23వ వార్డుకు చెందిన మొహ్మద్ ఆర్మన్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC) పత్రాన్ని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బాధిత బాలుడి తండ్రి మొహ్మద్ అజీమ్‌కు స్వయంగా అందజేశారు.