ఖమ్మం జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గుర్తించిన 10,833 మంది బాలికల్లో ఇప్పటివరకు 89 శాతం మందికి టీకాలు పూర్తి చేశారు. ఇప్పటికే 12 కేంద్రాల్లో వంద శాతం లక్ష్యం పూర్తయింది. మిగిలిన 1,224 మందికి కూడా గడువులోగా వ్యాక్సిన్ వేసేందుకు వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. అపోహలు వీడి పిల్లలకు టీకాలు వేయించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
ఖమ్మంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ స్పీడ్.!


