హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయానికి ఎమ్మెల్యే భారీ విరాళం

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.12 లక్షల విరాళం అందించారు. సోమవారం ఆలయ పనులను పరిశీలించి కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు. ఈనెల 30న ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.