హైదరాబాద్: 28°C
వ్యాపారం

తక్కువ పోర్ట్‌ఫోలియో.. భారీ నష్టాలు!

ట్రేడర్ల పోర్ట్‌ఫోలియో పరిమాణానికి, వారు చేసే టర్నోవర్‌కు పొంతన లేదని సెబీ నివేదిక స్పష్టం చేసింది. సుమారు 95L మంది(78%) ట్రేడర్ల ఖాతాల్లో రూ.లక్ష లోపే షేర్లున్నాయి. కానీ మొత్తం నష్టాల్లో వీరి వాటాయే 70%. విచిత్రమేమిటంటే.. లక్ష లోపు పోర్ట్‌ఫోలియో ఉండి, రూ.కోటికిపైగా డెరివేటివ్స్ టర్నోవర్ చేసిన వారు 13% మంది ఉన్నారు. మొత్తం నష్టాల్లో సగం(52%) నష్టాలు వీరివే.