హైదరాబాద్: 28°C
వ్యాపారం

చిన్న నగరాల ట్రేడర్ల హవా..!

డెరివేటివ్స్ మార్కెట్లో మెట్రోయేతర నగరాలు, చిన్న పట్టణాల పెట్టుబడిదారుల భాగస్వామ్యం భారీగా పెరుగుతోంది. మొత్తం ట్రేడర్లలో మూడింట రెండొంతుల మంది వీరే కాగా, టర్నోవర్‌లో 50% వాటా కలిగి ఉన్నారు. అయితే వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్లలో వీరి వాటా కేవలం 25 శాతమే. అంటే నష్టభయం ఉన్నప్పటికీ.. రిస్క్ ఉన్న F&Oలకే వీరు మొగ్గుచూపుతున్నట్లు సెబీ నివేదిక స్పష్టం చేసింది.