హైదరాబాద్: 28°C
వ్యాపారం

ట్రేడింగ్‌లో పేదలకే దెబ్బ: సెబీ

ట్రేడింగ్‌లో నష్టపోతున్న వారిలో తక్కువ ఆదాయ వర్గాలే ఎక్కువ. డెరివేటివ్స్ ట్రేడర్లలో మూడొంతుల మంది వార్షికాదాయం రూ.5 లక్షల లోపే ఉంది. వీరు మొత్తం టర్నోవర్‌లో 43%, నష్టాల్లో 53% వాటా కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఏకంగా 88% మంది నష్టపోయారు. మరోవైపు రూ.కోటి కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న ట్రేడర్లలో నష్టపోయిన వారు 81 శాతంగా ఉన్నట్లు సెబీ తాజా అధ్యయనం తేల్చింది.