SKLM: వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి ఒక్క పేదవానికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాపారావు, వాసు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


